తేజ సజ్జా, మంచు మ‌నోజ్ ‘మిరాయ్’ టీజ‌ర్ రెడీ

తేజ సజ్జా, మంచు మ‌నోజ్ ‘మిరాయ్’ టీజ‌ర్ రెడీ

‘హనుమాన్’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు తేజ సజ్జా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా సినిమా మిరాయ్. మంచు మ‌నోజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, మైథాలాజిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్-అడ్వెంచర్‌గా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజర్ చూస్తుంటే.. మౌర్య చ‌క్ర‌వ‌ర్తి అశోకుడికి సంబంధించిన రహస్యాలు, తొమ్మిది రహస్య గ్రంథాలు, ఒక శక్తివంతమైన ఆయుధం ‘మిరాయ్’ చుట్టూ ఈ కథ అల్లుకుని ఉంది. మానవజాతిని నాశనం చేయాలని చూస్తున్న ఒక చీకటి శక్తిని అడ్డుకోడానికి తేజ సజ్జా పోరాడుతుంటాడు. ఈ చీకటి శక్తికి అధిపతిగా మంచు మనోజ్ ‘ది బ్లాక్ స్వార్డ్’ గా భయంకరమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. టీజర్‌లో మనోజ్ పవర్‌ఫుల్ లుక్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. విజువల్ ఎఫెక్ట్స్‌, యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తేజ సజ్జా అమాయకుడిగా కనిపించి, ఆ తర్వాత సూపర్ యోధుడిగా మారే పరిణామక్రమం, రైలుపై యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. రీతికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రియా సరన్, జయరామ్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

editor

Related Articles