నందమూరి హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. నందమూరి వంశం నాలుగో తరం వారసుడిగా తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితరులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి వారిని అభినందించారు. ఈ సినిమా ప్రారంభమైన సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తారక రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు. “తారక రామారావు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అని సీఎం చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సినిమా ప్రారంభోత్సవం అనంతరం హీరో తారక రామారావు మాట్లాడుతూ, “మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకీరామ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయని నమ్ముతున్నాను. ఈ రోజు నా కుటుంబ సభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు.
- May 12, 2025
0
71
Less than a minute
Tags:
You can share this post!
editor

