ప్రేమ, దేశభక్తి నేపథ్యంలో ‘తండేల్’

ప్రేమ, దేశభక్తి నేపథ్యంలో ‘తండేల్’

‘గత ఏడాదిన్నర నుండి నా జీవితంలో నిజమైన తండేల్‌ వచ్చింది అల్లు అరవింద్‌ గారు. ఆయన లేకుండా మరో సినిమా చేయగలనా అనే ఫీలింగ్‌ వచ్చింది. ఈ సినిమా విషయంలో ఆయనో మార్గదర్శిలా నాకు తోడ్పడ్డారు’ అన్నారు నాగచైతన్య. ‘ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న విడుదలకానుంది. మంగళవారం విశాఖపట్నంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ప్రేమ, దేశభక్తి ప్రధానంగా ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందించారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘నాకు వైజాగ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.

editor

Related Articles