మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడు హీరోగా ఎంట్రీ..

మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడు హీరోగా ఎంట్రీ..

త‌మిళం నుండి మ‌రో ద‌ర్శ‌కుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ద‌ర్శ‌కుడి నుండి హీరోగా మారి స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుండ‌గా తాజాగా మ‌రో ద‌ర్శ‌కుడు హీరోగా రాబోతున్నాడు. సౌత్ ఇండ‌స్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా సరికొత్త అవతారమెత్తబోతున్నారు. కార్తీతో ‘ఖైదీ’, విజయ్‌తో ‘మాస్టర్’, ‘లియో’, కమల్ హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ వంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ దర్శకుడు తాజాగా ‘కెప్టెన్ మిల్లర్ 2’ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.

editor

Related Articles