సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్!

సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్!

బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది తాజ్ స్టోరీ’. ఈ సినిమా అక్టోబ‌ర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా విడుద‌ల‌ని అడ్డుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ సినిమా చారిత్రక వాస్తవాలను వక్రీకరించ‌డ‌మే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంద‌ని పిటిషనర్ ఆరోపించారు.
అడ్వకేట్ షకీల్ అబ్బాస్ ఈ పిటిషన్‌ను దాఖలు చేయ‌గా.. ఇందులో ఆయన సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం, చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు పరేష్ రావల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ సినిమా తాజ్‌మహల్ చారిత్రక వాస్తవాలను వక్రీకరించ‌డ‌మే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంద‌ని తెలిపాడు. అలాగే ఒక ప్రత్యేక రాజకీయ సిద్ధాంతాన్ని ఈ చిత్రం ప్రోత్సహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఈ సినిమా విడుదలైతే మత విద్వేషాలకు దారితీసే అవకాశం ఉందని ఇది దేశ లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అబ్బాస్ ఆందోళన వ్యక్తం చేశారు.

editor

Related Articles