11 ఏళ్ల త‌ర్వాత టాలీవుడ్‌కి వస్తున్న బ్యూటీ..

11 ఏళ్ల త‌ర్వాత టాలీవుడ్‌కి వస్తున్న బ్యూటీ..

కోలీవుడ్‌ హీరో సూర్య టాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు – తమిళం) ప్రస్తుతం సూర్య 46 అనే టైటిల్‌తో రూపొందుతోంది. సినిమాకి సంబంధించిన‌ ఒక్కో అప్‌డేట్‌తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీమ్‌ మరో ఆసక్తికరమైన సమాచారం బయటపెట్టింది. బాలీవుడ్‌ సీనియర్‌ నటి రవీనా టాండన్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఆమె పుట్టినరోజు అక్టోబర్‌ 26 సందర్భంగా సినిమా యూనిట్‌ రవీనాకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఒక స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. “మీరు మా ప్రయాణంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది… రాబోయే అద్భుతమైన జర్నీ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ మేకర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సూర్య 46’లో ‘ప్రేమలు’ ఫేమ్‌ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు రవీనా టాండన్‌ కూడా జాయిన్‌ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది. ఆమె పాత్రపై ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

editor

Related Articles