హీరో సుమన్ కి మార్షల్ ఆర్ట్స్ లో మంచి అనుభవం ఉంది. ఐతే, కరాటే, జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్ ను ఏజెన్సీ గిరిజన ప్రాంత విద్యార్థులకు చేరువ చేయడంలో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని సుమన్ చెప్పుకొచ్చారు. అల్లూరి జిల్లా పాడేరులో సుమన్ ఆదివారం పర్యటించారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న కరాటే శిక్షణను సుమన్ తిలకించి.. అక్కడి విశేషాలను సుమన్ గమనించారు. సుమన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తి కావడం వల్ల.. ఆ దిశగా స్కూళ్లలో కరాటే విద్యను ప్రోత్సహించాలని, ఆ దిశగా తాను కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సుమన్ తెలిపారు.

- September 15, 2025
0
22
Less than a minute
You can share this post!
editor