మోగ్లీ నుండి స‌య్యారే లిరిక‌ల్‌ సాంగ్‌

మోగ్లీ నుండి స‌య్యారే లిరిక‌ల్‌ సాంగ్‌

సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీతో త్వ‌రలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మ‌య్యాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా క‌ల‌ర్ ఫొటో ఫేం సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రాఠి భామ‌ సాక్షి మ‌దోల్క‌ర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.
ఈ నేప‌థ్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించిన మేక‌ర్స్ తాజాగా హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ఈ సినిమా నుండి స‌య్యారే అంటూ సాగే ల‌వ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చంద్ర‌బోస్ సాహిత్యం అందించ‌గా స్వీయ సంగీతంలో ఐశ్వ‌ర్య ద‌రూరితో క‌లిసి కాల భైర‌వ  ఆల‌పించాడు.

editor

Related Articles