మ‌హాన‌టి లుక్‌లో మెరిసిన సుమ క‌న‌కాల‌..

మ‌హాన‌టి లుక్‌లో మెరిసిన సుమ క‌న‌కాల‌..

టాలీవుడ్ పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో సుమ క‌న‌కాల ఒక‌రు. ఎలాంటి పెద్ద ఈవెంట్ అయినా స‌రే సింగిల్ హ్యాండ్‌తో న‌డిపిస్తుంది సుమ‌. సందర్భానుసారం సెటైర్లు వేస్తూ, నవ్విస్తూ ఈవెంట్‌ని ర‌క్తి క‌ట్టిస్తుంది. ఒక్కొక్క‌రు యాంకరింగ్‌కి గుడ్ బై చెప్పుకుంటూ వెళుతున్న సుమ మాత్రం కొన్ని ద‌శాబ్ధాలుగా స‌త్తా చాటుతూనే ఉంది. ఎంతమంది వ‌చ్చిన సుమ‌ని బీట్ చేయ‌లేక‌పోతున్నారు. గతంలో సుమ కొన్ని సినిమాల్లో నటించింది కానీ అవి గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రలు కావు. రెండేళ్ల క్రితం జయమ్మ పంచాయతీ అంటూ తానే ప్రధాన పాత్రలో నటించింది. జయమ్మ పంచాయతీ తర్వాత సుమ మరో సినిమాకి సైన్ చేయలేదు. అయితే రీసెంట్‌గా సుమ ఒక క్రేజీ సినిమాకి సంతకం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఓ కీల‌క పాత్ర‌లో సుమ క‌నిపించి అల‌రించ‌నుద‌ట‌. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సుమ అప్పుడ‌ప్పుడు వెరైటీ ఫొటోలు షేర్ చేస్తూ అంద‌రినీ అల‌రిస్తూ ఉంటుంది. సుమ కనకాల మహానటిగా మారిపోయింది.. సేమ్ టు సేమ్ లుక్‌లో ఫొటో షూట్ షేర్ చేసింది. సుమ‌ని ఇలా చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు. అచ్చం మ‌హాన‌టి మాదిరిగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

editor

Related Articles