‘ఫౌజీ’ సినిమాలో చిన్నప్పటి ప్రభాస్‌గా సుధీర్ బాబు కొడుకు దర్శన్ చేస్తున్నాడు. గతంలో అతను ‘గూఢచారి, సర్కారు వారి పాట’ సినిమాలలోనూ నటించాడు. సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. కృష్ణ చిన్నకూతురు ప్రియదర్శిని భర్త అయిన సుధీర్ బాబు తన కొడుకులనూ సినిమా రంగంలోకే తీసుకొస్తుండటం విశేషం. ప్రియదర్శిని, సుధీర్ బాబు జంటకు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి చరిత మానస్. ఇతను గతంలో ‘భలే భలే మొగాడివోయ్’ సినిమాలో చిన్నప్పటి నానిగా నటించాడు. అలానే చిన్న కొడుకు దర్శన్ కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. 2018లో వచ్చిన ‘గూఢచారి’లో చిన్నప్పటి అడివి శేష్ గానూ, 2022లో వచ్చిన ‘సర్కారు వారి పాట’లో చిన్నప్పటి మహేష్ బాబు గానూ దర్శన్ నటించాడు. తాజాగా సుధీర్ బాబు తనయుడు దర్శన్ ‘ఫౌజీ’ సినిమాలో యంగ్ ప్రభాస్‌గా నటిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా అతని తండ్రి సుధీర్ బాబు తెలిపాడు.
- October 28, 2025
0
2
Less than a minute
You can share this post!
editor

