కిచ్చా సుదీప్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌..

కిచ్చా సుదీప్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌..

కన్నడ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా తెలుసున్న హీరోయే. ఈగ సినిమాలో విల‌న్‌గా న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. సెప్టెంబ‌ర్ 1న కిచ్చా సుదీప్ 51వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌గా, ఆయ‌న‌కి ఫ్యాన్స్, సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలుగు ప్రేక్షకులకు ‘ఈగ’ సినిమాతో విలన్‌గా పరిచయమైనప్పటికీ, ఆ తర్వాత హీరోగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుదీప్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 47వ సినిమా నుండి గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. గ్లింప్స్‌తో పాటు సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. మార్క్ ‘MARK’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేయ‌గా, సుదీప్ బర్త్‌డేను పురస్కరించుకుని గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సెంధిల్ త్యాగరాజన్ – అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

editor

Related Articles