రామాయణ సినిమా కోసం హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్..

రామాయణ సినిమా కోసం హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్..

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ సినిమా “రామాయణ” సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామునిగా రణబీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రావణ్ పాత్రలో యష్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి యష్ కేవలం నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ మ్యాడ్ మాక్స్ తదితర సినిమాలకి వర్క్ చేసిన గయ్ నోరిస్ ఈ సినిమాకి పని చేస్తుండగా సెట్స్ నుండి యష్‌తో యాక్షన్ సన్నివేశాలపై చర్చిస్తున్న పిక్ ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

editor

Related Articles