హీరో కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శృతిహాసన్‌కి తొలి రోజుల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మూడు ఇండస్ట్రీలలోనూ నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ ఆరంభంలో వరుసగా ఫ్లాప్ సినిమాల వల్ల ఆమెను “ఐరన్ లెగ్” అని పిలిచేవారు. అయితే పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అప్పటి నుండి శృతి వెనక్కి చూసుకోలేదు. ఇప్పుడామె పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తోంది. అన్ని భాషల్లోనూ ఆఫర్లు అందుకుంటూ అభిమానులను సొంతం చేసుకుంది. అయితే శృతి సినిమాల ఎంపిక విషయంలో సోషల్ మీడియాలో తరచూ విమర్శలు ఎదుర్కొంటోంది. కొన్ని సినిమాల్లో కేవలం ఐటెం సాంగ్‌కి లేదా చిన్న పాత్రలకే పరిమితమైందని కామెంట్స్ వచ్చాయి. తాజాగా వచ్చిన ‘కూలీ’ సినిమాలోనూ ఆమె పాత్రపై విమర్శలు వచ్చాయి. మోనికా పాటలో పూజా హెగ్డేకు వచ్చిన గుర్తింపు కూడా శృతికి రాలేదని నెటిజన్లు విమర్శించారు. ఈ కామెంట్స్‌కు శృతి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మూడు ఫొటోలు షేర్ చేసింది. మొదటిది దోశ ఫొటోతో “దోశ = లైఫ్” అంటూ పోస్ట్ చేయడం ద్వారా తనకు సింపుల్ థింగ్స్‌లోనే హ్యాపీనెస్ వెతుక్కుంటున్నానని తెలిపింది. రెండోది మేకప్ రూంలో వర్కింగ్ మూడ్ ఫొటో.

- October 22, 2025
0
34
Less than a minute
You can share this post!
editor