బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఆర్యన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. కిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు లక్ష్య ఈ సినిమాలో హీరోగా నటించబోతుండగా.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, రాజమౌళి, అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ముంబైలో ప్రీమియర్ ను ప్రదర్శించారు మేకర్స్. అయితే ఈ ప్రీమియర్ కు బాలీవుడ్ తారలతో పాటు ముఖేష్ అంబానీ దంపతులు, తదితర రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

- September 18, 2025
0
29
Less than a minute
You can share this post!
editor