బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 2న జరిగిన ఈ వేడుకలో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ఈ వేడుకను షారూఖ్ తన కుటుంబంతో కలిసి అలీబాగ్‌లోని తన విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా దర్శక – నిర్మాత కరణ్ జోహార్ తన చిలిపి చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయన నటి రాణీ ముఖర్జీతో కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో కరణ్ తెల్లటి దుస్తుల్లో రాణీ ముఖర్జీ బుగ్గపై ప్రేమగా ముద్దు పెడుతుండగా, రాణీ నవ్వుతూ కెమెరాకు పోజిచ్చింది.
- November 3, 2025
0
47
Less than a minute
You can share this post!
editor

