అఖిల్‌తో  సినిమా  చేయని  శ్రీలీల..!

అఖిల్‌తో  సినిమా  చేయని  శ్రీలీల..!

టాలీవుడ్ హీరో అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే  టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయ‌గా.. రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ గ్లింప్స్ ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్న శ్రీలీల సినిమా నుండి త‌ప్పుకుంద‌ని తెలుస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఖరారైనట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఇతర ప్రాజెక్టులు, ముఖ్యంగా హిందీ, తమిళ సినిమాల కోసం డేట్స్ కేటాయించడం కష్టంగా మారిన కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి శ్రీలీల‌ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఇంకా రావాల్సి ఉంది. మ‌రోవైపు ఈ వార్తలు నిజమైతే, శ్రీలీల స్థానంలో మరో హీరోయిన్‌ను వెతికే పనిలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు బాలీవుడ్‌లో తమిళంలో కార్తీక్ ఆర్య‌న్‌తో ఒక సినిమాలో సుధ కొంగ‌రాలో న‌టిస్తోంది.

editor

Related Articles