పెళ్లిపై ఆస‌క్తిక‌రమైన కామెంట్స్ చేసిన శ్రీలీల‌…

పెళ్లిపై ఆస‌క్తిక‌రమైన కామెంట్స్ చేసిన శ్రీలీల‌…

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదుగుతున్న శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా త‌న‌కు నచ్చిన కథలు, పాత్రలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే ఆమె కెరీర్‌ మలుపు తిరుగుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అలాగే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమాలోనూ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీల అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితం, ఆలోచనలను పంచుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కాబోయే భర్తకు ఉండవలసిన లక్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు కాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా ఫర్వాలేదు కాని, కానీ తనను బాగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలని శ్రీలీల పేర్కొంది. అలాగే తన సినీ కెరీర్‌కు మద్దతుగా నిలిచి, ప్రేమతో చూసుకునే వ్యక్తి, సరదాగా ఉండే వ్య‌క్తి, అన్నింటికంటే ముఖ్యంగా నిజాయితీగల వ్యక్తి కావాలని తెలిపింది. “అలాంటి వ్యక్తి ఎదురైతే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను” అంటూ స్పష్టం చేసింది.

editor

Related Articles