ప్రస్తుతం మన తెలుగు సినిమాలలో సక్సెస్‌లతో సంబంధం లేకుండా వరుసగా దూసుకెళ్తున్న హీరోయిన్ శ్రీలీల. పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరోయిన్ నుండి ఓ ఆసక్తికర అనౌన్స్‌మెంట్ వచ్చింది. తన నుండి ఓ క్రేజీ పోస్టర్ బయటకి రాగా అందులో నెవర్ బిఫోర్ లుక్‌లో శ్రీలీల కనిపిస్తోంది. అయితే ఇప్పుడు శ్రీలీల ఏజెంట్ మిర్చి అంటూ ప్రొజెక్ట్ చేసుకుంటోంది. ఒక స్టైలిష్ ఏజెంట్ లుక్‌లో వదిలిన ఈ ఫొటో ఫ్యాన్స్‌లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇది కొత్త సినిమానా లేక ఏదన్నా ఓటిటి షోనా అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే మిగతా డిటైల్స్‌ని శ్రీలీల ఈ అక్టోబర్ 19న రివీల్ చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చింది. అంతే కాకుండా ఇది మరో హిందీ సినిమా అన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ 19 వరకు ఆగితే కానీ శ్రీలీల ఏజెంట్ మిర్చి వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటి అనేది తెలియదు.

- October 14, 2025
0
68
Less than a minute
You can share this post!
editor