టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే సినిమాలోని ఒక ప్రత్యేక భక్తి గీతాన్ని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ‘కన్నప్ప’ సినిమా నుండి “శ్రీకాళహస్తి” అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ భక్తి గీతానికి ఒక ప్రత్యేక ఆకర్షణ తోడైంది. మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ పాటను ఆలపించారు. వారి గాత్రం ఈ పాటకు మరింత ఆధ్యాత్మికతను జోడించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. స్టీఫెన్ దేవస్సీ ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆధ్యాత్మిక గీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
- May 28, 2025
0
53
Less than a minute
Tags:
You can share this post!
editor

