సౌత్ వాళ్లు తిండి లేకపోయినా ఉండగలరు.. కానీ, సినిమాలు చూడందే ఉండలేరు: రాశీఖన్నా

సౌత్ వాళ్లు తిండి లేకపోయినా ఉండగలరు.. కానీ, సినిమాలు చూడందే ఉండలేరు: రాశీఖన్నా

‘ది సబర్మతి రిపోర్ట్‌’  సినిమాతో ఇటీవ‌ల సూప‌ర్ హిట్ కొట్టిన హీరోయిన్ రాశి ఖ‌న్నా. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేసిన ఈ భామ ప్ర‌స్తుతం బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిన విష‌యం తెలిసిందే. షాహిద్ క‌పూర్ న‌టించిన ఫ‌ర్జీతో పాటు విక్రాంత్ మ‌స్సే ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాలతో మంచి హిట్లు అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తున్న తెలుసుకదా సినిమాతో పాటు త‌మిళంలో అగాథియా అనే పీరియాడిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తోంది ఈ భామ‌. అయితే ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మ‌డు సౌత్ సినిమా అభిమానుల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. రాశి మాట్లాడుతూ.. దక్షిణాదిలో సినిమా అభిమానులు ఎక్కువ అక్క‌డ హీరోల‌ని దేవుడి లాగా కొలుస్తారు. సినిమా విడుద‌లైనప్పుడు పండుగలా భావిస్తారు. అందుకే సౌత్‌లో ప్రేక్ష‌కులు తిండి అయిన మానేస్తారు ఏమో కానీ సినిమాలు చూడ‌డం మాత్రం ఆపరు. అదే నార్త్‌లో ప్ర‌జ‌లు సినిమాలు ప‌క్క‌న పెట్టి మిగ‌తా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ త‌ర్వాత సినిమాలు చూస్తారు అంటూ రాశి ఖ‌న్నా చెప్పుకొచ్చింది.

editor

Related Articles