బొమ్మరిల్లు, సత్యం, హ్యాపీ, ఢీ, రెడీ, సై సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న హీరోయిన్ జెనీలియా. తన నటనతో ఎన్నో అవార్డులతో పాటు తెలుగులో హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. అయితే ఈ హీరోయిన్ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం చాలారోజులు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చాలారోజుల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు జెనీలియా. ఈ క్రమంలోనే ఒక యాంకర్ జెనీలియాని అడుగుతూ.. మీకు సౌత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చెప్పుకోదగ్గ పాత్రలు అందలేదు కదా అని అడుగుతాడు. దీనికి జెనీలియా స్పందిస్తూ.. యాంకర్ మాటాలను తప్పుబట్టింది. నాకు ఎప్పుడూ అలా జరుగలేదు. నా సౌత్ సినిమాలు చూసుకుంటే.. నాకు ఎప్పుడూ ఉత్తమ పాత్రలు వచ్చాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చేసిన పని నాకు చాలా గుర్తింపును తెచ్చిపెట్టింది. సౌత్ అంటే నా కెరీర్ ఎదిగిన స్థలం.. ఇక్కడ నాకు లభించిన పాత్రలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ జెనీలియా చెప్పుకొచ్చింది.
- June 19, 2025
0
74
Less than a minute
Tags:
You can share this post!
editor

