తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోనూసూద్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోనూసూద్‌

ప్రముఖ నటుడు సోనూ సూద్‌  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానన్నారు. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. నంది పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నామని, అందులో తాను నటిండటంతోపాటు దర్శకత్వం కూడా చేస్తున్నానని వెల్లడించారు.

editor

Related Articles