మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టే కథతో తెరకెక్కిన సినిమా ‘సోలో బాయ్’. గతంలో మేం చేసిన ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఓ ప్రయోగం. అది మాకు అన్ని విధాలా వర్కౌట్ అయ్యింది. నిర్మాణం విషయంలో ఆ సినిమా నుండి నేర్చుకున్న పాఠాలను బేస్ చేసుకుని, తగు జాగ్రత్తలతో ‘సోలో బాయ్’ తీశాం. ప్రేక్షకులకు అన్ని రకాలుగా వినోదాన్ని పంచే సినిమా ఇది అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ అన్నారు. ‘బిగ్‌బాస్’ ఫేం గౌతమ్‌కృష్ణ, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి ప్రధాన పాత్రధారులుగా, నవీన్‌కుమార్ దర్శకత్వంలో సెవెల్‌హిల్స్ సతీష్ నిర్మించిన చిత్రం ‘సోలో బాయ్’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం నిర్మాత సతీష్ విలేకరులతో ముచ్చటించారు. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో పనిచేశానని, తర్వాత రియల్ ఎస్టేట్ వల్ల ఆర్ధికంగా నిలదొక్కుకున్నానని, సినిమాపై పాషన్‌తో ఈ సినిమా తీశానని ఆయన తెలిపారు.
- July 4, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor

