కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ప్రేమకథా చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ఎం.పూర్ణానంద్ దర్శకుడు. జూలై 11న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందిస్తున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. కథానుగుణంగా పాటలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఓ ఫీల్‌గుడ్ సినిమాగా మెప్పిస్తుంది’ అన్నారు. సోషియో ఫాంటసీ కథ కావడంతో గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేశామని, ఆహ్లాదభరితమైన సన్నివేశాలతో సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ తెలిపారు. నాగినీడు, కాశీవిశ్వనాథ్, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: కిషోర్ మద్దాలి.
- June 28, 2025
0
55
Less than a minute
Tags:
You can share this post!
editor

