బిగ్ బాస్ సీజన్ 3 విజేత, ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై తెలుగు పాటను నిలబెట్టిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేమికురాలు హరిణి రెడ్డితో ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ కనిపించే రాహుల్ ఈసారి మాత్రం తన నిశ్చితార్థ వేడుకను చాలా ప్రైవేట్‌గా ఉంచారు. ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయిన, వారికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఫొటోలో రాహుల్, హరిణి రెడ్డి కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీలో రాయల్ లుక్‌లో కనిపించగా, హరిణి ఆరెంజ్ కలర్ లెహంగాను ధరించి తళుక్కుమంది. ఈ జంటని చూసిన వారంతా కూడా చూడముచ్చటగా ఉందంటున్నారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.

- August 18, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor