ఉగ్ర‌దాడి భయంతో.. శ్రేయాఘోషల్‌ మ్యూజికల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్

ఉగ్ర‌దాడి భయంతో.. శ్రేయాఘోషల్‌ మ్యూజికల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్

జ‌మ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉగ్ర‌దాడి అనంత‌రం దేశంలో ప‌రిస్థితులు ఉత్కంఠగా మారిన విష‌యం తెలిసిందే. పలు న‌గ‌రాల్లో ఇప్ప‌టికే భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. అయితే దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం హై అలర్ట్ ఉండ‌డంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ షోల‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సింగ‌ర్‌ అర్జిత్‌ సింగ్‌ ఏప్రిల్‌ 27న చెన్నైలో జరగాల్సిన తన షో రద్దు చేసుకోగా.. తాజాగా సింగ‌ర్ శ్రేయాఘోషల్ కూడా త‌న కన్స‌ర్ట్‌ను ర‌ద్దుచేసుకుంది. నేడు గుజ‌రాత్‌లోని సూర‌త్ వేదిక‌గా శ్రేయాఘోషల్‌  మ్యూజిక్ క‌న్స‌ర్ట్ ఉండ‌గా.. తాజాగా క్యాన్సిల్ చేసుకున్నామ‌ని ప్ర‌క‌టించింది శ్రేయా. ఇప్ప‌టికే షో కోసం టికెట్లు బుక్ చేసుకున్న‌వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని వెల్ల‌డించారు. ‘ఆల్ హార్ట్స్ టూర్ అనే పేరుతో శ్రేయాఘోషల్ దేశ విదేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈరోజు సూరత్‌లో జరగాల్సిన కార్యక్రమం రద్దయింది. మ‌ళ్లీ ముంబైలో మే 10న ఆమె షో ఉంటుంది. మరోవైపు, అనిరుధ్ కూడా ‘హుకుమ్’ పేరుతో ప్రపంచ టూర్‌ చేస్తున్నారు. మే 31న బెంగళూరులో జరగనున్న ఆయన కాన్సర్ట్ టికెట్లు గంటలోనే అమ్ముడయ్యాయి. ప్రేక్షకుల ఆదరణతో జూన్ 1న కూడా కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

editor

Related Articles