రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా “గేమ్ ఛేంజర్”. ఈ సినిమా అనుకున్న రేంజ్లో అంచనాలు అందుకోలేదని తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌కి వచ్చిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ తర్వాత టెలివిజన్ టెలికాస్ట్‌కి కూడా వచ్చింది. మరి టీవిలో ఈ సినిమా అందుకున్న రేటింగ్ బయటకి వచ్చింది. మరి గేమ్ ఛేంజర్ మొదటి టెలికాస్ట్‌లో 5.02 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్‌ని అందుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. ఇది ఒకింత తక్కువే కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన పలు భారీ బ్లాక్ బస్టర్స్ పరిస్ధితి కూడా అంతే అని చెప్పాలి. సలార్, కల్కి 2898 ఎడి లాంటి హిట్ సినిమాలకి కూడా ఇదే రీతిలో రేటింగ్ వచ్చింది. మరి వాటితో చూస్తే గేమ్ ఛేంజర్ స్మాల్ స్క్రీన్‌పై హిట్టే అని చెప్పొచ్చు.
- May 8, 2025
0
142
Less than a minute
Tags:
You can share this post!
administrator

