కాంటా లగా పాట ఫేమ్ షెఫాలీ జరీవాలా.. ఆకస్మిక మరణం?

కాంటా లగా పాట ఫేమ్ షెఫాలీ జరీవాలా.. ఆకస్మిక మరణం?

ఇటీవ‌ల సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రి మృతి గురించి మ‌రిచిపోక‌ముందే మ‌రొక‌రు త‌నువు చాలిస్తుండ‌డం సినీ ప్రియుల‌ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా ప్రముఖ హిందీ నటి, మోడల్ “కాంటాల‌గా సాంగ్ పాట ఫేమ్ అయిన” షెఫాలి జరివాలా గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. ఆమె వయసు 42 ఏళ్లు. శుక్ర‌వారం ఆమె అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. షెఫాలి ఛాతీలో బాగా నొప్పి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో ఆమె భ‌ర్త పరాగ్ త్యాగి వెంట‌నే ఆమెని అంధేరిలోని బెల్లేవ్యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్ప‌టికే ఆమె కన్నుమూసిన‌ట్టు వైద్యులు తెలియ‌జేశారు. అనంత‌రం మృతదేహాన్ని కోపర్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం త‌ర‌లించారు. 2002లో ఆశా పరేఖ్ చిత్రంలోని కాంటా లగా పాట‌తో దేశవ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. ఇది పాప్ కల్చర్‌కు సంచలనంగా మారింది. ఇక షెఫాలి 2015లో పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది. పరాగ్ త్యాగితో పాటు నాచ్ బలియే 5, నాచ్ బలియే 7 డ్యాన్స్ రియాలిటీ షోలలో కూడా పాల్గొని సంద‌డి చేసింది. అయితే షెఫాలి ఆకస్మిక మరణం సినిమా పరిశ్రమను, ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పాప్ సింగర్ మికా సింగ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాడు. ఆమె మ‌ర‌ణంతో నేను చాలా షాక్ అయ్యాను అని అన్నారు. ఇక సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా షెఫాలి జ‌రివాలాకి సంతాపం తెలియ‌జేస్తున్నారు.

editor

Related Articles