అమలాపాల్ ఆ మధ్య ‘‘ఆడై’’ (తెలుగులో ‘ఆమె’) అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమలాపాల్ ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ ఒంటిపై బట్టలు లేకుండా, పూర్తి నగ్నంగా యాక్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇంతకీ, అమలాపాల్ ఏం మాట్లాడింది అంటే.. ‘ఆడై’ (ఆమె) షూటింగ్ సమయంలో 15 మంది పురుషులు నా చుట్టూ ఉన్నారు. ఆ షూటింగ్ సమయంలో వాళ్లందరినీ నా భర్తలుగా భావించి నటించాను’ అంటూ షాక్ ఇచ్చింది. అమలాపాల్ ఇంకా మాట్లాడుతూ. ‘వాళ్లందరినీ నా భర్తలుగా భావించకపోతే ఆ సీన్‌ను రక్తి కట్టించలేకపోయేదాన్ని. ఈ సీన్‌ను షూట్ చేయాల్సిన సమయంలో నగ్నంగా ఉండాలని నిర్మాతలు ముందుగా సమాచారం ఇచ్చారు. ఆ సన్నివేశం షూటింగ్ చేసే రోజు ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. సెట్స్‌లో ఏమి జరుగుతుందో, ఎవరు ఉంటారు, సెక్యూరిటీ ఉందో లేదో తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్నాను. అక్కడ కెమెరామెన్, లైట్ బాయ్‌తో సహా సెట్‌లో 15 మంది మాత్రమే ఉన్నారు’ అంటూ అమలాపాల్ చెప్పింది.
- June 16, 2025
0
92
Less than a minute
Tags:
You can share this post!
editor

