జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంగళవారం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిని సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ సినీ హీరో షారుక్ ఖాన్ ఎక్స్ వేదికలో స్పందించాడు. పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి ఘటనపై తనలో ఉన్న బాధను, కోపాన్ని మాటల్లో వ్యక్తపరచడం కష్టం. ఇలాంటి సమయంలో, దేవుడి వైపు తిరిగి, బాధిత కుటుంబాల కోసం ప్రార్థన చేయడం తప్ప వేరే దిక్కులేదు. ఈ దుర్ఘటనలో బాధితులైన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మనమందరం ఒక దేశంగా ఐక్యంగా, బలంగా నిలబడి ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారికి న్యాయం జరిగేలా చూద్దామంటూ షారుక్ రాసుకొచ్చాడు.
- April 23, 2025
0
142
Less than a minute
Tags:
You can share this post!
editor

