శబ్ధం సినిమా.. ఆది పినిశెట్టి-థియేటర్లలోకి వచ్చే రిలీజ్ టైం ఫిక్స్‌..!

శబ్ధం సినిమా.. ఆది పినిశెట్టి-థియేటర్లలోకి వచ్చే రిలీజ్ టైం ఫిక్స్‌..!

తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్లలో ఒకరు ఆది పినిశెట్టి. ఈ టాలెంటెడ్‌ యాక్టర్ కాంపౌండ్ నుండి వస్తోన్న సినిమా శబ్దం. వైశాలి ఫేం అరివజగన్‌ వెంకటాచలం  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ క్యూరియాసిటీ పెంచేస్తోంది. చాలారోజుల తర్వాత విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమాని 2025 ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. భయం శబ్ధం భయపెట్టించేందుకు వస్తోంది.. అంటూ లాంచ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. హార్రర్‌ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాలో అలనాటి అందాల తార లైలా కీలక పాత్రలో నటిస్తుండగా.. సిమ్రాన్‌, లక్ష్మీ మీనన్‌, రెడిన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ థమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

editor

Related Articles