‘శశివదనే’అక్టోబర్‌ 10న రిలీజ్..

‘శశివదనే’అక్టోబర్‌ 10న రిలీజ్..

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా రూపొందుతున్న ఫీల్‌గుడ్‌ వింటేజ్‌ విలేజ్‌ లవ్‌స్టోరీ ‘శశివదనే’. సాయిమోహన్‌ ఉబ్బన దర్శకుడు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోదాల నిర్మాతలు. ఈ సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. అక్టోబర్‌ 10న సినిమా విడుదల కానుంది. ఓ దృశ్యకావ్యంగా ఈ సినిమాను రూపొందించామని, అనుదీప్‌దేవ్‌ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలమని, విజువల్‌గా కూడా సినిమా అద్భుతంగా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. శ్రీమాన్‌, దీపక్‌ ప్రిన్స్‌, జబర్దస్త్‌ బాబీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాకి కెమెరా: శ్రీసాయికుమార్‌ దారా, సమర్పణ: గౌరీనాయుడు.

editor

Related Articles