న్యూ లుక్‌కి కార‌ణం ఆ లేడీనా..?

న్యూ లుక్‌కి కార‌ణం ఆ లేడీనా..?

టాలీవుడ్ హీరోలు సినిమాల కోసం తమ లుక్‌లో చేసే మార్పులు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుంటాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో చేరారు హీరో శర్వానంద్. సిక్స్ ప్యాక్ బాడీతో, సన్నగా మారిన కొత్త లుక్‌లో శర్వా ఫొటోలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా స్లిమ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్న శర్వానంద్‌ను చూసి నెటిజన్లు “ఇది శర్వానందేనా?” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యూత్ ట్రెండ్‌కు తగినట్లుగా ఆయన ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన “బైకర్” ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో శర్వా రేసర్‌గా నటిస్తున్నారు. ఆ లుక్ కోసం ఆయన కొన్ని నెలల పాటు కఠినమైన వర్కౌట్స్‌, డైట్‌ ఫాలో అయ్యారని సమాచారం. అయితే శ‌ర్వా లుక్ వెన‌క విదేశాల‌కి చెందిన ఫిట్‌నెస్ లేడీ ట్రైన‌ర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆమె ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ‌ర్వానంద్ ఇలాంటి లుక్‌లోకి మారాడ‌ని తాజాగా వైర‌ల్ అవుతున్న వీడియోని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఈ వీడియో చూస్తుంటే శ‌ర్వానంద్ మంచి స‌క్సెస్ కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేసిన‌ట్టు అర్ధ‌మవుతోంది.

editor

Related Articles