సీనియర్ నటి రమ్యశ్రీ పై దాడి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేసన్ దగ్గరలోని ఎఫ్‌సీఐ కాలనీ లేఔట్‌లో హైడ్రా రోడ్ల మార్కింగ్ చేపట్టగా, ప్లాట్ యజమానుల సమక్షంలో అధికారులు మార్కింగ్ చేశారట. అయితే ప్లాట్ ఓనర్స్‌లో ఒకరైన రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ దానిని వీడియో తీశారు. ఈ క్రమంలోనే సంధ్యా కన్వెన్షన్ యజమాని అయిన శ్రీధర్ అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. మా స్థలంలో మేం వీడియో తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అని రమ్యశ్రీ ప్రశ్నించగా.. వారు ఆగ్రహంతో రెచ్చిపోయారు. క్రికెట్ బ్యాట్, కత్తితో రమ్యశ్రీతో పాటు, ఆమె సోదరుడిపైగా దాడికి యత్నించినట్లు సమాచారం.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితులు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ ఆగడాలకు అడ్డుకట్టవేసి తమకు రక్షణ కల్పించాలని రమ్యశ్రీ తమ ఫిర్యాదులో పేర్కొంది. గచ్చిబౌలి లాంటి రద్దీ ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే పట్టపగలు ఇలా సినీ నటిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. రమ్యశ్రీ సోదరుడు ప్రశాంత్‌కి చిన్నపాటి గాయాలు అయినట్టు తెలుస్తోంది. రమ్యశ్రీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
- June 18, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor

