అర్ధ‌రాత్రి ఆ హీరోయిన్‌పై విరుచుకుప‌డ్డ సందీప్ రెడ్డి..

అర్ధ‌రాత్రి ఆ హీరోయిన్‌పై విరుచుకుప‌డ్డ సందీప్ రెడ్డి..

అర్జున్ రెడ్డి సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఆ త‌ర్వాత కూడా హిట్స్ తీసి టాప్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో చేరాడు. త్వ‌ర‌లో ఆయ‌న స్పిరిట్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌నుండ‌గా, యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ని ఇటీవ‌ల అనౌన్స్ చేశాడు. అయితే ముందు దీపికా అంటూ వార్త‌లు రాగా, తర్వాత సందీప్ త‌న పేజ్ ద్వారా త్రిప్తిని హీరోయిన్‌గా  అనౌన్స్ చేశాడు. అనేక కండిషన్లు పెట్టడం వల్లే ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. అయితే ఇదే ఇష్యూ మీద బాలీవుడ్ మీడియాలో వరుసగా సందీప్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు రావ‌డం మొద‌లు పెట్టాయి. దీపిక త‌ప్పుకోడానికి సందీప్ రెడ్డినే ప్ర‌ధాన కార‌ణం అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఎక్కువ‌గా ‘ఎ’ రేటెడ్ సీన్లు ఉండడం వల్ల దీపిక ఈ సినిమా నుండి తప్పుకుందని, సందీప్ అన్ ప్రొఫెషనల్ అని ప్ర‌చారాలు సాగుతున్న నేప‌థ్యంలో ఇదంతా పీఆర్ స్టంట్స్ అని గ్ర‌హించిన సందీప్ రెడ్డి వంగా దీపికాకి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. సోమవారం అర్ధరాత్రి వేళ ‘ఎక్స్’ వేదిక‌గా దీపిక పేరు ఎత్తకుండానే ఆమె మీద పెద్ద బాంబులే వేశాడు. నేను ఒక క‌థ‌ని ఆర్టిస్ట్‌కి చెప్పానంటే అవ‌త‌లి వ్య‌క్తిపై ఉన్న పూర్తి న‌మ్మ‌కంతోనే చెబుతాను. కానీ ఆ కథను బయటపెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారు. నా కథని బహిర్గతం చేయడమే కాకుండా ఒక యాక్టర్‌ని కూడా తక్కువ చేయ‌డం మీ ఫెమినిజం?

editor

Related Articles