నేను సిక్ అయినప్పుడు రాహుల్ రవీంద్రన్ నాకు అండ అన్న సమంత

నేను సిక్ అయినప్పుడు రాహుల్ రవీంద్రన్ నాకు అండ అన్న సమంత

టాలీవుడ్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల సినిమాల కన్నా ఇత‌ర విష‌యాలతో ఎక్కువ‌గా వార్త‌లలో నిలుస్తూ వ‌స్తోంది. మ‌యోసైటిస్ వ‌ల‌న సినిమాలు కాస్త త‌గ్గించిన స‌మంత సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్‌కి సంబంధించిన ప‌లు విష‌యాలు పంచుకుంటూ ఉంటుంది. అలానే ఇంట‌ర్వ్యూల‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తూ ఉంటుంది. తాజాగా కోలీవుడ్‌లో జరిగిన గోల్డెన్‌ క్వీన్‌ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ నటి సమంత గోల్డెన్‌ క్వీన్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అలానే దర్శకుడు, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌తో తనకి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఆయన తనకు అండగా నిలిచిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత చెప్పుకొచ్చింది. లేచిన ద‌గ్గ‌ర నుండి సాయంత్రం వ‌ర‌కు రాహుల్ నాతోనే ఉంటూ జాగ్ర‌త్త‌గా చూసుకున్నాడు. మా బంధానికి పేరు పెట్ట‌లేను. స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను అంటూ రాహుల్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచింది స‌మంత‌.

editor

Related Articles