టాలీవుడ్ సమంత రూత్ ప్రభు టాటూల విషయంలో తన అభిమానులకు కీలకమైన సలహా ఇచ్చింది. మీరు ఎప్పటికీ టాటూ వేయించుకోవద్దు అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గతంలో సమంత తన శరీరంపై మూడు టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే. వీటిలో రెండు ఆమె మాజీ భర్త నాగ చైతన్యకు సంబంధించినవి కావడం గమనార్హం. ఆమె తొలి సినిమా ‘ఏ మాయ చేశావే’ పేరులోని మొదటి అక్షరాలు YMC ఆమె మెడ వెనుక భాగంలో ఉన్నాయి. ‘Chay’ టాటూ: ఆమె పక్కటెముకల మీద నాగ చైతన్య ముద్దు పేరు ‘Chay’ అని పచ్చబొట్టు వేయించుకున్నారు. అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత, సమంత తన టాటూల పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. గతంలో ఇన్‌స్టాగ్రామ్ Q&A సెషన్‌లో ఒక అభిమాని టాటూ ఆలోచనల గురించి అడిగినప్పుడు, ఆమె తన అభిమానులకు సలహా ఇస్తూ “ఎప్పటికీ టాటూ వేయించుకోవద్దు” అని చెప్పుకొచ్చింది.
- May 28, 2025
0
168
Less than a minute
Tags:
You can share this post!
editor


