సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, టైగర్ ష్రాఫ్ వంటి ప్రముఖ తారలు పాల్గొనే బాలీవుడ్ బిగ్ షాట్ యుకె టూర్ ఇటీవలి భారతదేశం – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా వాయిదా పడింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ఈలోగా డబ్బులు తిరిగి చెల్లిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. బాలీవుడ్ బిగ్ షాట్ యుకె టూర్ వాయిదా పడింది. ఇదే విషయాన్ని నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనను షేర్ చేశారు. సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, ఇతరులు పాల్గొనాల్సి ఉంది. సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, దిశా పటాని, కృతి సనన్, సారా అలీఖాన్, సునీల్ గ్రోవర్, మనీష్ పాల్ పాల్గొనే బాలీవుడ్ బిగ్ షాట్ యుకె టూర్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడినట్లు నిర్వాహకులు ధృవీకరించారు. అధికారిక ప్రకటన ప్రకారం “భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఇటీవలి పరిణామాలు” ఈ నిర్ణయం వెనుక పహల్గామ్ కాల్పులే కారణమని పేర్కొంది. “జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, పర్యటనను తిరిగి షెడ్యూల్ చేయాలనే కష్టమైన నిర్ణయం తీసుకున్నాము” తిరిగి ఎప్పుడు అనేది ఒక ప్రకటనలో తెలియజేస్తాము.
- April 28, 2025
0
155
Less than a minute
Tags:
You can share this post!
editor

