బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ డ్రామా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. ఈ సినిమాకు అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా ఎంపికైంది. సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. భారతదేశం – చైనా సరిహద్దుల్లో 2020లో జరిగిన గల్వాన్ లోయ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు సల్మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన ఇంకా ఏమీ రాలేదు.

- September 9, 2025
0
33
Less than a minute
You can share this post!
editor