ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన సల్మాన్‌..?

ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన సల్మాన్‌..?

బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన షర్ట్‌లేని ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. 59 ఏళ్ల వయసులో కూడా ఆయన కండలు, సిక్స్‌ప్యాక్ ప్రదర్శిస్తూ కనిపించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. సల్మాన్ ఖాన్ తన అద్భుతమైన ఫిజిక్‌ను చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫొటోలపై కామెంట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాను గుర్తుచేస్తూ అభిమానులు ‘టైగర్ జిందా హై’ అని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు, “ఇండియాకు ఫిట్‌నెస్ ఐకాన్ సల్మాన్!” అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ కోసం సిద్ధమవుతున్నట్లు ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది.

editor

Related Articles