నా గురించి చెడ్డగా చెప్పేవాడు ఆ దర్శకుడు.

నా గురించి చెడ్డగా చెప్పేవాడు ఆ దర్శకుడు.

ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు తీసే దర్శక నిర్మాతలు.. స్టార్ హీరోల గురించి, సినిమాల ఫెయిల్యూర్స్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం అసందర్భంగా ఇలాంటి విషయాలు బయటపడతుంటాయి. కొన్నిరోజుల క్రితం తమిళ దర్శకుడు ఎఆర్ మురుగదాస్.. సల్మాన్‌పై నేరుగా కౌంటర్స్ వేశాడు. సికిందర్ ఫ్లాప్ కావడానికి అతడే బాధ్యుడు అన్నట్లు మాట్లాడాడు. దీంతో సల్మాన్ ఫ్యాన్స్‌తో పాటు చాలామంది సినీ ప్రేక్షకులు షాకయ్యారు. మదరాసి సినిమా ప్రమోషన్ల టైంలో డైరెక్టర్ మురుగదాస్.. సల్మాన్ ఖాన్‌పై ఈ కామెంట్స్ అన్నీ చేశాడు. రాత్రి 9 గంటల తర్వాత హీరో షూటింగ్‌కి వచ్చేవాడని, పిల్లల్ని స్కూల్‌కి పంపే సీన్స్ కూడా అర్ధరాత్రి 2-3 గంటలకు తీశామని డైరెక్టర్ అన్నాడు. వంటికి తగిలిన గాయాలవల్ల నేను షూటింగ్‌కు రావడం ఆలస్యమైతే దాన్ని మరోలా చెప్పుకుని నెగిటివ్ చేశారు. ముందు నిర్మాత సాజిత్ నడియావాలా తప్పుకుంటే.. తర్వాత సౌత్ సినిమా మదరాసి తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయారు. అక్కడి యాక్టర్ సాయంత్రం ఆరు గంటలకే సెట్‌కి వచ్చేవాడు. అందుకే అది సికిందర్ కన్నా పెద్ద హిట్ అయింది అని సల్మాన్ ఖాన్ సెటైరికల్‌గా గట్టిగానే కౌంటర్స్ వేశాడు. ఇన్ని చెప్పిన మురుగదాస్ మదరాసి సినిమాతో ఘోరమైన ఫలితాన్ని అందుకున్నాడు.

editor

Related Articles