టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై వ్యాఖ్యలు చేసిన సయామీ ఖేర్‌..!

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై వ్యాఖ్యలు చేసిన సయామీ ఖేర్‌..!

తాజాగా మరో హీరోయిన్‌ సైతం క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించింది. టాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రముఖ నటి సయామీ ఖేర్‌ కీలక విషయాలను బయటపెట్టింది. టాలీవుడ్‌కు చెందిన ఓ లేడి ఏజెంట్‌ అవకాశాల కోసం తనను ‘సర్దుకుపోవాలి’ అని చెప్పిందని తెలిపింది. తాను అలాంటి పనులకు దూరంగా ఉంటానని.. తనకు కొన్ని పరిమితులు ఉన్నాయంటూ తేల్చి చెప్పినట్లు చెప్పింది. సయామీ ఖేర్‌ 2015లో ‘రేయ్‌’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత 2016లో మిర్జియాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మౌళి, చోక్డ్‌, వైల్డ్‌డాగ్‌, ఘూమర్‌ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌లలోనూ నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు వచ్చిన అవకాశాలతో సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పింది.

editor

Related Articles