‘హిట్ 3’ ప్రమోషన్ కంటెంట్ అదిరిపోయింది. దానికి తగ్గట్టే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా. వంద శాతం సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి తిపిర్నేని. ఈ సినిమా కూడా హిట్.. నోడౌట్. ‘హిట్’ ఫ్రాంచైజీలో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ప్రయత్నిస్తే శైలేష్ చేయగలరు. నాని నా అంచనాలను మించి ఎదిగాడు. ఇంకా ఎదగాలని ఆశిస్తున్నా.’ అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మెచ్చుకున్నారు. హీరో నాని అప్ కమింగ్ సినిమా ‘హిట్: ది 3rd కేస్’. శ్రీనిధిశెట్టి హీరోయిన్. దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్’ ప్రాంచైజీలో ఇది మూడో సినిమా. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న రాజమౌళి పై విధంగా స్పందించారు. మే 1న సినిమాపై మనకున్న ప్రేమను దేశం మొత్తం చూసేలా చేద్దాం.’ అని నాని చెప్పారు. ఇంకా విష్వక్‌సేన్, అడివి శేషు, డైరెక్టర్ రామ్ జగదీష్, డీవోపీ సానుజాన్ వర్గీస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- April 28, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor

