ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాలో సాయిపల్లవి?

ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాలో సాయిపల్లవి?

హీరోయిన్ సాయిపల్లవి నటిస్తున్న తాజా సినిమా తండేల్ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆమె నటించబోయే తెలుగు సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ హీరోయిన్ హిందీలో రామాయణ పార్ట్ -1, ఏక్‌దిన్ సినిమాలతో బిజీగా ఉంది. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే సాయిపల్లవి తెలుగు స్క్రిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు. ఈ హీరోయిన్ ప్రభాస్ ఫౌజీ సినిమాలో కీలకమైన పాత్రలో నటించనుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇండిపెండెన్స్ వచ్చిన కాలంలో ఓ సైనికుడి ప్రేమకథగా ఫౌజీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.

editor

Related Articles