అమ్మ ఆశీస్సులతో దక్కిన విలువైన అవార్డు!

అమ్మ ఆశీస్సులతో దక్కిన విలువైన అవార్డు!

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి చెప్పకనే చెప్పినట్టుగా కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తరువాత సాయి దుర్గ తేజ్ మరో జన్మను ఎత్తినట్టుగా ఎంతో జాగ్రత్తగా జీవిస్తున్నారు. అందరికీ రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ప్రాధాన్యాన్ని కూడా చెబుతుంటారు. తాజాగా సాయి దుర్గ తేజ్ తనకు వచ్చిన అవార్డు, ఆ అవార్డుని అమ్మ విజయ దుర్గ గారి చేతుల మీదుగా అందుకోవడం గురించి పోస్ట్ వేశారు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాకి గాను డెబ్యూ హీరోగా సినీ మా అవార్డును సాధించారు. అయితే ఆ మొదటి అవార్డుని తల్లి చేతుల మీదుగా సాయి దుర్గ తేజ్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ పునర్జన్మలో మొదటి అవార్డుని కూడా తల్లి చేతుల మీదుగానే సాయి దుర్గ తేజ్ తీసుకున్నారు. యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025లో మోస్ట్ డిజైరబుల్ స్టార్ (మేల్) అవార్డుని తీసుకున్న క్షణాల గురించి సాయి దుర్గ తేజ్ ఎమోషనల్‌గా స్పందించారు.

editor

Related Articles