గ్రామీణ వాతావరణం ఉత్తర తెలంగాణ  స్టైల్లో  సెట్‌

గ్రామీణ వాతావరణం ఉత్తర తెలంగాణ  స్టైల్లో  సెట్‌

సంపత్‌నంది డైరెక్షన్‌లో ఈ సినిమాని కెకె రాధామోహన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్న సినిమా. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల నేపథ్య కథాంశంతో హీరో శర్వానంద్‌ హీరోగా సినిమా చేస్తున్నారు. శర్వానంద్‌ నటిస్తున్న ఈ సినిమాతో కలిపి 38 గా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో భారీ సెట్‌ను వేస్తున్నారు. బుధవారం భూమి పూజతో సెట్‌వర్క్‌ను మొదలుపెట్టారు. ఉత్తర తెలంగాణ సంస్కృతిని, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ను తీర్చిదిద్దబోతున్నారు. కళా దర్శకుడు కిరణ్‌ కుమార్‌ నేతృత్వంలో ఈ సెట్‌కు రూపకల్పన చేస్తున్నామని, ఇందులో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తామని మేకర్స్‌ తెలిపారు. 1960 దశకంలో నడిచే పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ఇదని, ప్రేక్షకుల్ని ఆనాటి కాలంలోకి తీసుకెళ్తుందని, హీరో శర్వానంద్‌ సరికొత్తగా కనిపిస్తారని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్‌రాజన్‌, మ్యూజిక్: భీమ్స్‌ సిసిరోలియో, రచన-డైరెక్షన్: సంపత్‌నంది.

administrator

Related Articles