యాక్షన్ కింగ్ అర్జున్, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ డైరెక్షన్‌లో తీసిన సినిమా. ఫాతిమా నిర్మాత. ఈ నెల 18న (శుక్రవారం) విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శక నిర్మాత సమీర్ సినిమా విశేషాలు తెలియజేస్తూ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది ఉంటుంది. అర్జున్, జేడీ చక్రవర్తి పోటాపోటీగా నటించారు.
విభిన్న కథాంశంతో తెరకెక్కించాం. రాధిక కుమారస్వామి, సోనీచరిష్టా హీరోయిన్లుగా నటించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు నటించిన ఆఖరి సినిమా ఇది. ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్: సుభాష్ ఆనంద్, డైరెక్షన్: ఎస్.ఎస్.సమీర్.