ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రీపొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్ పైకి ఎక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ పాత్రను చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలిసింది. ఇందులో ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపిస్తారని చెబుతున్నారు. ‘బాహుబలి’లో ప్రభాస్ డ్యూయల్ రోల్‌ని పోషించినా.. రెండు పాత్రలు (ఇద్దరు) తెరపై ఒకేసారి కనిపించలేదు. ‘స్పిరిట్’ చిత్రంలో మాత్రం రెండు క్యారెక్టర్స్ ఒకేసారి తెరపై కనిపిస్తాయని చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో రణబీర్‌కపూర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారని అంటున్నారు. వీరితో పాటు ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించే అవకాశం లేకపోలేదు.

- October 17, 2024
0
48
Less than a minute
Tags:
You can share this post!
administrator