నిమిషానికి రూ.90 వేలు..!

నిమిషానికి రూ.90 వేలు..!

ఒక నిమిషం వీడియోకు రూ.90 వేలు చార్జ్‌ చేశామని, ఇలా సుమారు 15 వీడియోలు ప్రమోట్‌ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసిన విష్ణుప్రియ, రీతూచౌదరిలు గురువారం పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ ఇద్దరిని రాత్రి తొమ్మిది గంటల వరకు పోలీసులు విచారించారు. విష్ణుప్రియను సుమారు పది గంటలపాటు, రీతూ చౌదరిని ఆరు గంటలపాటు పంజాగుట్ట డిఐ శ్రవణ్‌ ఆధ్వర్యంలో విచారించారు. ఇద్దరి బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ ద్వారా వచ్చిన నిధులపై ఆరా తీశారు. గురువారం విచారణ పూర్తైన తర్వాత ఈ ఇద్దరినీ ఈనెల 25న మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు టేస్టీ తేజా, కానిస్టేబుల్‌ కిరణ్‌లను పోలీసులు విచారించారు.

editor

Related Articles