RRR, పుష్ప 2, యానిమల్ జాబితాలో ‘కుబేర’ కూడా!

RRR, పుష్ప 2, యానిమల్ జాబితాలో ‘కుబేర’ కూడా!

లేటెస్ట్‌గా టాలీవుడ్ సినిమా నుండి వచ్చిన సాలిడ్ హిట్ సినిమా “కుబేర”. చాలాకాలం నుండి థియేటర్స్‌కి జనం రావట్లేదు అనే మాటని కుబేర బద్దలుకొట్టి మళ్ళీ థియేటర్స్‌కి జనాన్ని వచ్చేలా చేస్తోంది. ఇలా ఎట్టకేలకి మళ్ళీ థియేటర్స్ కళకళలాడుతుండగా ఈ సాలిడ్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్‌గా మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంటోంది. అయితే ఇదే సినిమా ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ నుండి సహా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన పలు భారీ సినిమాల తరహాలోనే ఒక అంశంలో అమితంగా ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ అయ్యిన సినిమాలు RRR, పుష్ప 2 అలాగే యానిమల్ లాంటి భారీ సినిమాలకి 3 గంటలకి పైగా నిడివి ఉంది. అయినప్పటికీ థియేటర్స్‌లో జనాన్ని కూర్చోపెట్టవచ్చు. సరైన సినిమా తీస్తే అది చూసే వారికి ఎలాంటి ఇబ్బంది కాదు అని ఒకదాని తర్వాత ఒకటి నిరూపించాయి. మరి వీటితో పాటుగా ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో వచ్చిన కుబేర సినిమా కూడా నిలిచింది అని చెప్పవచ్చు. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జునలతో కలిసి చేసిన మ్యాజిక్ థియేటర్స్‌లో సాలిడ్‌గా వర్కౌట్ అయ్యింది. సో రన్ టైం పరంగా ఎక్కువ ఉన్నా కూడా ఆడియెన్స్‌ని కూర్చోబెట్టగలవు అనే సినిమాల జాబితాలో ఇప్పుడు కుబేర కూడా నిలిచింది.

editor

Related Articles